Karnataka elections 2023: కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్.. జై బజరంగ్ బలీ నినాదాలు చేసిన మోదీ.. వీడియో

Karnataka elections 2023: ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో... ఇస్లామిక్ సంస్థ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో పాటు హిందూ సంస్థ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పింది.

Karnataka elections 2023: కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్.. జై బజరంగ్ బలీ నినాదాలు చేసిన మోదీ.. వీడియో

PM Modi

Karnataka elections 2023: బీజేపీ తరఫున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జై బజరంగ్ బలీ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక (Karnataka )లో తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను ( Bajrang Dal) నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మోదీ జై బజరంగ్ బలీ (Jai Bajrang Bali) అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఇవాళ మూడు ప్రాంతాల్లో మోదీ బహిరంగ సభల్లో మాట్లాడారు. ఆ మూడు సభల్లో జై బజరంగ్ బలీ అంటూ నినాదాలు చేశారు. అక్కడి ప్రజలతోనూ ఆ నినాదం చేయించారు.

అలాగే, ఎప్పటిలాగే భారత్ మాతా కీ జై నినాదాలు కూడా చేశారు. ఉత్తర కర్ణాటకలోని ముల్కీలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల సూత్రధారులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని ఆరోపించారు. తాము జాతి వ్యతిరేకులపై పోరాటం చేస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తుందని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశంసిస్తోంటే కాంగ్రెస్ మాత్రం విదేశీ గడ్డపై దేశ పరువు తీసేలా మాట్లాడుతోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల ఆధారంగా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి గాలి రాజకీయాలే తెలుసని, తనను దూషించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో… ఇస్లామిక్ సంస్థ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో పాటు హిందూ సంస్థ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పింది.

బాగా డేర్ చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఇస్లామిక్ సంస్థతో పాటు హిందూ సంస్థనూ రద్దు చేస్తారట