KCR review meeting : తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతి నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం (Apex council meeting)లో అనుసరించాల్సిన వ్యూహంపై జలవనరుల శాఖ (Irrigation officials) అధికారులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని చెప్పారు.
స్వరాష్ట్రంలో వ్యవయసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకుని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శమని కేసీఆర్ తెలిపారు.