KCR on National Party: నేడు టీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్‌ సమావేశం

దేశంలో జాతీయ పార్టీని ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశం జరపనున్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్న భోజనం అనంతరం వారితో కేసీఆర్ సమావేశం అవుతారు. నేటి సమావేశంలో జాతీయ పార్టీ పేరుతో పాటు అజెండా వంటి అంశాలపై తుది చర్చలు జరుగుతాయి.

KCR on National Party: దేశంలో జాతీయ పార్టీని ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశం జరపనున్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్న భోజనం అనంతరం వారితో కేసీఆర్ సమావేశం అవుతారు. నేటి సమావేశంలో జాతీయ పార్టీ పేరుతో పాటు అజెండా వంటి అంశాలపై తుది చర్చలు జరుగుతాయి.

దసరా నాడు జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అలాగే, ఈ నెల 6 లేదా 7న బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.

దసరా రోజున పలు రాష్ట్రాలకు చెందిన రైతులు, కార్మిక సంఘాలు, పలు పార్టీల నేతలను ప్రగతిభవన్‌కి ఆహ్వానించనున్నట్లు సమాచారం. పార్టీకి భారత రాష్ట్రీయ సమితితో పాటు నవ భారత్ పార్టీ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి కూడా గులాబీ జెండాతో పాటు కారు గుర్తే ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలవకుండా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్లాన్ వేసుకున్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ ప్రణాళికలు వేసుకున్నారు. మనుగోడు ఉప ఎన్నికల బాధ్యతలు ఎవరెవరికి అప్పగించాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు.

Gandhi Jayanti 2022: ఐరాసలో నిన్న మహాత్మా గాంధీ సందేశం.. వీడియో

ట్రెండింగ్ వార్తలు