Gandhi Jayanti 2022: ఐరాసలో నిన్న మహాత్మా గాంధీ సందేశం.. వీడియో

ఇవాళ భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా నిన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రత్యేక ఏర్పాట్లు చేసి తమ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ ప్రసంగించేలా చేసింది. అంటే, ఆయన సందేశం ఇస్తున్నట్లు ప్రొజెక్టర్‌ సాయంతో గాంధీ హోలోగ్రామ్‌ను తెరపై ప్రదర్శించింది ఐరాస. గాంధీజీనే మాట్లాడుతున్నట్లు ఆడియో సందేశాన్ని వినిపించింది. మహాత్మా గాంధీ హోలోగ్రామ్‌ను ఐరాసలో ప్రదర్శించడం ఇదే మొట్టమొదటిసారి.

Gandhi Jayanti 2022: ఐరాసలో నిన్న మహాత్మా గాంధీ సందేశం.. వీడియో

Gandhi Jayanti 2022

Gandhi Jayanti 2022: ఇవాళ భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా నిన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రత్యేక ఏర్పాట్లు చేసి తమ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ ప్రసంగించేలా చేసింది. అంటే, ఆయన సందేశం ఇస్తున్నట్లు ప్రొజెక్టర్‌ సాయంతో గాంధీ హోలోగ్రామ్‌ను తెరపై ప్రదర్శించింది ఐరాస. గాంధీజీనే మాట్లాడుతున్నట్లు ఆడియో సందేశాన్ని వినిపించింది. మహాత్మా గాంధీ హోలోగ్రామ్‌ను ఐరాసలో ప్రదర్శించడం ఇదే మొట్టమొదటిసారి.

గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2007లో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. సాంతికేతను వినియోగించుకుని ఐరాస చేసిన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను అక్కడి భారత కార్యాలయం ట్విటర్ లో పోస్ట్ చేసింది. యునెస్కో మహాత్మా గాంధీ శాంతి విద్య, సుస్థిర అభివృద్ధి విద్యా సంస్థ 10వ వార్షికోత్సవాలను రెండు రోజుల క్రితం ఐరాసలో ప్రారంభించారు. అలాగే, గాంధీ జయంతి సందర్భంగా అహింసా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఐరాస భారత ప్రతినిధి బృందం మహాత్మా గాంధీ గాంధీజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించింది. మహాత్మా గాంధీయే దిగివచ్చి సందేశం ఇస్తున్నట్లు హోలోగ్రామ్‌ను రూపొందించారు. దానికి వాయిస్‌ ఓవర్‌ జతచేసి ప్రదర్శించారు. అక్షరాస్యత విద్యకు ముగింపు కాదు.. అలాగే ప్రారంభం కాదని గాంధీ అన్నారు. విద్యా విధానం ద్వారానే మనిషిలోని ఉత్తమ లక్షణాలు బయటకు వస్తాయని చెప్పారు. ఆధ్యాత్మిక శిక్షణ కూడా విద్యా విధానానికి కేంద్ర బిందువని అన్నారు.

Asia Cup Women : మహిళల ఆసియా కప్‌.. శ్రీలంకపై భారత్ ఘన విజయం