Asia Cup Women : మహిళల ఆసియా కప్‌.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

మహిళల ఆసియా కప్ లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. టాస్ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Asia Cup Women : మహిళల ఆసియా కప్‌.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

asia cup women

Asia Cup Women : మహిళల ఆసియా కప్ లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. టాస్ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత ఓపెనర్లు షెఫాలీవర్మ (10), స్మృతి మంధాన (6) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే జెమీమా రోడ్రిగెజ్ (76) అదిరిపోయే ఆట తీరుతో చెలరేగింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) అండగా నిలిచింది.

వీళ్లిద్దరూ వెనుతిరిగిన తర్వాత దయాలన్ హేమలత (13 నాటౌట్), రిచా ఘోష్ (9), పూజా వస్త్రాకర్ (1), దీప్తి శర్మ (1 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 150/6 స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఆ జట్టులో ఓపెన్ హర్షిత సమరవిక్రమ (26), హాసిని పెరేరా (30) మాత్రమే రాణించారు.

Robin Uthappa Retirement: క్రికెట్‌‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప ..

వీళ్లు కాకుండా కేవలం ఒషాది రణసింఘే (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు వేసిన ఎక్స్‌ట్రాలే 13 కావడం గమనార్హం. మిగతా బ్యాటర్లందర్నీ ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్ల ధాటికి.. లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ టోర్నీని ఘన విజయంతో ప్రారంభించింది.

భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లతో చెలరేగగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. రాధా యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. బ్యాటుతో అదరగొట్టిన జెమీమా రోడ్రిగెజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.