Mallikarjun Kharge To Stay On As Leader Of Opposition
Congress U-Turn: కొద్ది రోజుల క్రితం రాజస్తాన్‌లో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్ శివిర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో కనిపించడం లేదు. ఆ సమయంలో చేసిన తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం అశోక్ గెహ్లాట్ విషయంలో ఉదయ్‌పూర్ తీర్మానంపై నిక్కచ్చిగా వ్యవహరించిన కాంగ్రెస్, ఖర్గే విషయంలో మాత్రం మాట తప్పింది. ఖర్గేను రాజ్యసభ విపక్ష నేతగా కొనసాగించడానికే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఉదయ్‌పూర్ తీర్మానం ఏంటంటే.. కాంగ్రెస్‌లోని ఎవరైనా సరే, ఒక పదవి మాత్రమే చేపట్టాలి. రెండు పదవులు ఎవరికీ ఉండకూడదని చింతన్ శివర్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం గాంధీ కుటుంబంతో పాటు సీడబ్ల్యూసీ సహా దేశంలోని గ్రామస్థాయి కార్యకర్తకు కూడా వర్తిస్తుందని ప్రకటించారు. ఇదే కారణాన్ని చూపిస్తూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అటు ముఖ్యమంత్రిగా, ఇటు పార్టీ అధినేతగా కుదరదంటే కుదరదని పార్టీ స్పష్టం చేసింది.
Pawan Kalyan : వేగం నడిచే ఇంజిన్‌లో ఉండదు.. నడిపేవాడి నరాల్లో ఉంటది.. పవన్ బైక్ రైడింగ్ చూశారా?
అనంతరం, రాజ్యసభ విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేను పోటీలో దింపి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్యసభ విపక్ష పదవి నుంచి ఆయన తప్పుకుంటారని అనుకున్నారంతా. అయితే ఆ పదవిలో ఆయననే కొనసాగించాలనే ఆలోచనలో పార్టీ ఉందట. గెహ్లాట్ విషయంలో కఠినంగా వ్యవహరించిన కాంగ్రెస్, ఖర్గే విషయంలో ఎందుకు మాట తప్పిందనే విమర్శ పార్టీ అంతర్గతంగానే పెద్ద ఎత్తున రానుంది. రేపు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ సహా మరికొద్ది మంది ముఖ్య నేతలతో సోనియా సమావేశమై, ఈ విషయంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించనున్నారట.
Gujarat Polls: మోదీ నిర్వహించిన అతి పెద్ద రోడ్-షోలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారో తెలుసా?