Mamata Banerjee: కేంద్రంపై పోరు తీవ్రం చేసిన మమతా బెనర్జీ.. రెండు రోజుల ధర్నాలకు సిద్ధం

కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి పైసా నిధులను కూడా అందులో ప్రకటించలేదు. అందుకే రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయబోతున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం కింద కూర్చొని ధర్నా చేయబోతున్నాను

Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల మధ్య సాగుతున్న పోరు తెలిసిందే. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఒకరిపై మరొకరు తీవ్రంగా విరుచుకు పడుతుంటారు. ఈ విషయంలో ఎవరినీ తీసిపారేయలేం. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తిప్పి కొట్టడానికి మమతా బెనర్జీ తాజాగా మరో అంశాన్ని ఎత్తుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంపై రెండు రోజుల పాటు ధర్నా చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. మార్చి 29, 30 తేదీలలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‭కతాలో ఆమె దీక్ష చేపట్టనున్నట్లు స్వయంగా మమతా బెనర్జీయే మంగళవారం వెల్లడించాయి.

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ.. వ్యతిరేకించిన సీబీఐ

‘‘కేంద్రం నుంచి ఉపాధి హామీకి నిధులు రాని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. చాలా కాలంగా ఈ నిధుల విడుదలను ఆపేశారు. రాష్ట్రం మీద తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి పైసా నిధులను కూడా అందులో ప్రకటించలేదు. అందుకే రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయబోతున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం కింద కూర్చొని ధర్నా చేయబోతున్నాను. ఇది మార్చి 29 నుంచి ప్రారంభమై 30వ తేదీ సాయంత్రం ముగుస్తుంది’’ అని డండం ఎయిర్‭పోర్టులో మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ వెల్లడించారు.

Indrakeeladri Temple : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై వసంత‌ ఉత్సవాలు, భక్తులు పాల్గొనాలంటే..

ట్రెండింగ్ వార్తలు