INDIA: కులతత్వ పార్టీలతో కాంగ్రెస్ కూటమి.. ఇండియా కూటమిపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు

Mayawati

Mayawati on INDIA: విపక్షాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఇండియా (I.N.D.I.A) కులతత్వ పార్టీల కలయిక అంటూ బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి విమర్శలు గుప్పించారు. కులతత్వం కలిగిన పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కొత్త కూటమి ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సహా తొందరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవారం ఉదయం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ కూటమిపై విరుచుకుపడ్డారు.

Advocate Rajiv Mohan: నిర్భయ నిందితులను ఉరి తీయాలన్న లాయరే ఇప్పుడు బ్రిజ్ భూషణ్ కు బెయిల్ ఇప్పించారు

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కూటమిలోని ఏ పార్టీ దళితులకు కానీ వెనుకబడిన వర్గాల ప్రయోజనాల గురించి ఆలోచించే పరిస్థితి లేదని, అవన్నీ ఆధిపత్యవర్గాల భావజాలంతో నడిచేవని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అయినా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా అయినా బహుజన వర్గాల ప్రజలకు వ్యతిరేకమని, అందుకే ఆ రెండు కూటములకు బీఎస్పీ తలుపులు మూసివేశామని మాయావతి అన్నారు.

INDIA: విపక్ష కూటమిలో అప్పుడే లుకలుకలు.. బెంగళూరులో నితీశ్‮‭ను అవమానిస్తూ పోస్టర్లు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బిహార్ నేతలు

‘‘కాంగ్రెస్ తన కులతత్వ, పెట్టుబడిదారీ ఆలోచనలను పక్కనపెట్టి, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసి ఉంటే.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట విని ఉంటే బీఎస్పీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని మాయావతి అన్నారు.