MCD Mayor Election: మున్సిపల్ మీటింగులో ఆప్, బీజేపీ మధ్య హైడ్రామా.. మేయర్ ఎన్నిక వాయిదా

ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ భవనంలోని మీటింగ్ హాలులోనే డెస్క్‭ల పైకెక్కి నానా హంగామా చేశారు. ఈ ఘర్షణలో కొందరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ నేత సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించడం ఈ ఘర్షణకు ప్రధాన కారణం.

MCD Mayor Election: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక తీవ్ర వివాదంగా మారింది. భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్లు కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. ఇందులో కొందరు చేయి చేసుకునే వరకు కూడా వెళ్లింది. మేయర్ ఎన్నికపై మొదటిసారిగా శుక్రవారం మున్సిపల్ బాడీ సమావేశమైంది. అయితే ప్రొటెం స్పీకర్‭గా బీజేపీ నేతను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడం ఆప్‭కు కోపం తెప్పించింది. దీనిని ఆప్ వ్యతిరేకిస్తూ బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగగా, కేజ్రీవాల్‭కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. ఈ తరుణంలో మేయర్ ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి నోటీసులో ఎన్నిక తేదీని ప్రకటించనున్నారు.

Chandrababu Dharna On Road : లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ రోడ్డుపై చంద్రబాబు ధర్నా

ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ భవనంలోని మీటింగ్ హాలులోనే డెస్క్‭ల పైకెక్కి నానా హంగామా చేశారు. ఈ ఘర్షణలో కొందరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ నేత సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించడం ఈ ఘర్షణకు ప్రధాన కారణం.

UFO Shot Down: భూమిపైకి దూసుకొస్తున్న గ్రహాంతర నౌకను రష్యా కూల్చేసిందా? ఆ వీడియో నిజమేనా?

తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయం. అయితే, సత్య శర్మను ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ ఢిల్లీ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ వ్యతిరేకిస్తోంది. ఎల్జీ వీకే సక్సేనా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. అలాగే బీజేపీపై కూడా విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని, వ్యవస్థల్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని మండిపడింది. సంప్రదాయం ప్రకారం సీనియర్ కౌన్సిలర్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని, కానీ, వీకే సక్సేనా తనకు కావాల్సిన బీజేపీ నేతను నియమించారని ఆప్ విమర్శించింది.

Supreme Court : ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? అంటూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరిని ఆప్ ఎంపిక చేస్తుంది. బీజేపీ తరఫున రేఖా గుప్తా మేయర్ పదవికి పోటీ పడనుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆప్ తరఫున మొహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున కమల్ బాగ్రి పోటీ పడుతున్నారు. ఢిల్లీ మేయర్ పదవి ఐదేళ్లూ రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. మొదటి సంవత్సరం మహిళ, రెండో ఏడాది ఓపెన్ కేటగిరి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరి, నాలుగు, ఐదు సంవత్సరాల్లో ఓపెన్ కేటగిరి వ్యక్తులు ఎన్నికవుతారు.

ట్రెండింగ్ వార్తలు