Chandrababu Dharna On Road : లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ రోడ్డుపై చంద్రబాబు ధర్నా

లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ కుప్పం పర్యటనలో గుడుపల్లి రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు ధర్నా చేపట్టారు.

Chandrababu Dharna On Road : లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ రోడ్డుపై చంద్రబాబు ధర్నా

Chandrababu dharna on the road in Gudipally

Chandrababu dharna on the road in Gudipally : తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు పోలీసులు. మొన్న చంద్రబాబు ఎన్నికల రథాన్ని సీజ్ చేశారు. పర్యటన వద్దు వెనక్కి వెళ్లిపోవాలంటూ చంద్రబాబు ప్రచార రథం తాళాలు వేసి పట్టుకుపోయారు. అయినా చంద్రబాబు తన పర్యటనను కొనసాగించారు. రథం లేకపోయినా కాలి నడకతో పర్యటించారు. కానీ పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. ముందుగా ఖరారు అయిన పర్యటనలకు అనుమతి కోసం టీడీపీ నేతలు జిల్లా పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపినా ఏమాత్రం అనుమతులు ఇవ్వటంలేదు.

దీంతో తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతు డీజీపీకి లేఖ రాశారు. పోలీసులు సీజ్ చేసిన తన వాహనాన్ని తనకు ఇవ్వాలని కోరారు. కానీ డీజీపీ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవటంతో పోలీసు యంత్రాంగం తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు గుడుపల్లిలో నడిరోడ్డుమీద కూర్చుని ఆందోళన చేపట్టారు. ఓ సైకో చెబితే ప్రజల కోసం పోరాడే తన పర్యటనను అడ్డుకుంటారా? ఏం తమాషాగా ఉందా? అని ప్రశ్నిస్తు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడుపల్లిలో రోడ్డు షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేపట్టారు చంద్రబాబు.

డీజీపీకి లేఖ రాసినా స్పందించకపోవడంపై చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ఓ సైకో చెబితే అలా పనిచేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాహితం కోసమే తన పోరాటమని పోలీసులు రాకుంటే ఏం చేయాలో అది చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు రోడ్డుపై బైఠాయించడంతో కుప్పంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా కందుకూరులో చంద్రబాబు రోడ్డు షోలో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సాకుతో ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలకు అనుమతి నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం జీవో జారీ చేసేనాటికే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. దీంతో కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయన ప్రచార రథాన్ని కూడా సీజ్ చేసి తాళాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి వాహనం తాళాలు ఇవ్వలేదు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు మండిపడుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి..ప్రజల వద్దకు వెళ్లకుండా ఆపివేయటానికి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక తన పర్యటనను జగన్ అడ్డుకోవటానికి నల్ల చట్టాలు తెచ్చారంటూ మండిపడుతున్నారు చంద్రబాబు.

వైసీపీ పాలనలో ఏపీలో రౌడీయిజం,అరాచకాలు ఎక్కువయ్యాయని పోలీసులు సైకో సీఎం చెప్పింది చేస్తూ ప్రజల పట్ల రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.పోలీసులంటే చాలా బాధ్యతగా వ్యవహరించాలని కానీ ఏపీ పోలీసులు మాత్రం ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారని ఇది సరైంది కాదని అన్నారు.

రోడ్డు షోలపై నిషేధం విధించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం రోడ్డు షోలు నిర్వహిస్తున్నారని ఇది ప్రభుత్వ నేతలకు ఓ రూలు..ప్రతిపక్షాలకు మరో రూలా? అని ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని కానీ ఏపీ పోలీసులు మాత్రం చట్ట ప్రకారం కాకుండా సైకో సీఎం ఆదేశాల మేరకే పనిచేస్తున్నారంటూ దుయ్యబట్టారు.పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు.