Union Minister Nitin Gadkari
Union Minister Nitin Gadkari: కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తన స్నేహితుడు ఒకరు తనకు గతంలో సూచించారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ అన్నారు. అయితే, కాంగ్రెస్ లో చేరడం కన్నా బావిలో దూకడం మంచిందని తాను చెప్పానని అన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో నిన్న ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నా మిత్రుడు శ్రీకాంత్ జిచ్కార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. నేను మంచి వాడినని, అయితే, ఉండకూడని పార్టీలో ఉన్నానని అన్నాడు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నాకు చెప్పాడు. నేను జిచ్కార్ కు ఓ విషయం చెప్పాను. బావిలోనైనా దూకి మునుగుతాను కానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరనని అన్నాను. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చవు’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు. అప్పట్లో తమ పార్టీకి ఎన్నికల్లో ఓటములు ఎదురవుతున్నాయని, అయినా పార్టీ మారలేదని అన్నారు.
యుద్ధంలో ఓడిపోతే అంతా అయిపోయినట్లు కాదని, పోరాటాన్ని ఆపేసి బయటకు వస్తేనే మనం వెనకడుగు వేసినట్లని గడ్కరీ చెప్పారు. వ్యాపారంలో, సామాజికంగా, రాజకీయంగా మానవ సంబంధాలే అతిపెద్ద బలమని ఆయన అన్నారు. ఒకరిని వాడుకుని వదిలేయడం వంటి పనులు ఎన్నటికీ చేయకూడదని చెప్పారు. మనం ఎవరి చేతినైనా ఒక్కసారి పట్టుకుంటే మనకు అంతా మంచే జరుగుతున్నా, చెడు జరుగుతున్నా ఆ చేతిని వదిలేయకూడదని అన్నారు. మనకు అవసరం ఉన్న సమయంలోనే పూజలు చేయాలన్న ధోరణి వద్దని చెప్పారు.
India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు