తెలంగాణ కాంగ్రెస్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న సమయంలోనే మరో ఎమ్మెల్యే పార్టీ వీడటం కలకలం రేపుతోంది. గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. అదేబాటలో.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి పెద్ద షాకే అని చెప్పాలి.
Also Read : ఈసీ తీపి కబురు : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్
నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ని కలిశారు. చర్చలు జరిపారు. టీఆర్ఎస్ పార్టీలోకి గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్లు తెలుస్తోంది. ఈయన టీఆర్ఎస్‌లో చేరితే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలినట్లేనని పలువురు భావిస్తున్నారు. లింగయ్య పార్టీ మారకుండా చూసేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన అందుబాటులోకి రావటం లేదు. ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారు. ఎవరినీ కలవటం లేదు.
Also Read : లోక్ సభ ఎన్నికల సెగ : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు