పాతపట్నం అసెంబ్లీ టికెట్‌ కలమట కుటుంబానికి దక్కుతుందా ? 

శ్రీకాకుళం పాతపట్నం అసెంబ్లీ టికెట్‌ కలమట కుటుంబానికి దక్కుతుందా ?

  • Publish Date - January 30, 2019 / 10:15 PM IST

శ్రీకాకుళం పాతపట్నం అసెంబ్లీ టికెట్‌ కలమట కుటుంబానికి దక్కుతుందా ?

శ్రీకాకుళం : పాతపట్నం అసెంబ్లీ టికెట్‌ కలమట కుటుంబానికి దక్కుతుందా ? అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా…ప్రజల్లో తీవ్ర వ్యతరేకత వ్యక్తమవుతోందా ? టీడీపీ టికెట్‌ ఇస్తే…ఓటమి ఖాయమా ? సొంత పార్టీ నేతలే సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడిస్తారా ? పాతపట్నంలో ఏం జరుగుతోంది. ముందు జడ్పీటీసీ, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే….అంతలోనే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిక. ఇది క్లుప్తంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ హిస్టరీ. ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో పాతపట్నం నియోజకవర్గం ఉంది. ఇక్కడ రాజకీయాలు చలికాలంలో వేడిసెగలు పుట్టిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన కలమట వెంకటరమణ….మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై 3వేల కోట్ల తేడాతో విజయం సాధించారు.

కలమట వెంకటరమణ తండ్రి కలమట మోహన్‌రావు…టీడీపీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కలమట కుటుంబానికి మంచి పట్టుంది. అయితే వైసీపీ తరపున గెలుపొందిన వెంకటరమణ….టీడీపీ అధికారంలోకి రావడంతో కండువా మార్చేశారు. ప్రభుత్వంలో చేరిన తర్వాత నియోజకవర్గానికి భారీగా నిధులు విడుదల చేయించుకొని….పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎంత అభివృద్ధి చేసినప్పటికీ….కలమటపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

కలమట కుటుంబానికి కాదని…తనకు టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తానంటూ మామిడి గోవిందరావు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దకాలంగా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొత్తూరు, హిర, ఎల్‌ఎన్ పేట, పాతపట్నం, మెళియపుట్టి మండలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో గోవిందరావుకు మంచి పేరు ఉండటంతో…కాంగ్రెస్, జనసేన పార్టీలు ఆహ్వానించాయి. అయితే వారి ఆహ్వానాన్ని తిరస్కరించారు. పాతపట్నంపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంది పార్టీ అధిష్ఠానం. 

ఈ నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు….కలమట, గోవింద్‌రావుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కలమటకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి….గోవిందరావుకు మంచి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ రెడ్డిశాంతిని అభ్యర్థిగా ప్రకటించడంతో….టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు డైలమాలో పడ్డాయి.