Aroori Ramesh Episode
Aroori Ramesh : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. నాలుగు గంటల పాటు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఎట్టకేలకు నాలుగు గంటల హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. మరోవైపు కేసీఆర్ నివాసానికి బీఎస్పీ నేతలు వెళ్లారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. వరంగల్ పార్లమెంట్ స్థానంపై సమీక్ష జరుగుతున్న సమయంలో వెళ్లడంతో ఆ సీటుపై మరింత ఆసక్తి ఏర్పడింది.
Also Read : తెలంగాణలో తీన్మార్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత? 3 ప్రధాన పార్టీల వ్యూహాలు ఏంటి?