Lok Sabha Elections 2024 : తెలంగాణలో తీన్మార్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత? 3 ప్రధాన పార్టీల వ్యూహాలు ఏంటి?

కాంగ్రెస్ సంక్షేమ ప్రణాళిక ఫలిస్తుందా? బీజేపీ జైశ్రీరామ్ నినాదం కలిసి వస్తుందా? బీఆర్ఎస్ పై సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా?

Lok Sabha Elections 2024 : తెలంగాణలో తీన్మార్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత? 3 ప్రధాన పార్టీల వ్యూహాలు ఏంటి?

Lok Sabha Elections 2024 Telangana Politics

Lok Sabha Elections 2024 : తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీలు కీలక అడుగులు వేశాయి. మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అధికార పార్టీ.. కాళేశ్వరంపై న్యాయ విచారణకు ఆదేశించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీల్లోనూ వెనుకబడ్డ కులాలకు సంబంధించి 16 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

మరోవైపు హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. వచ్చే ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వారియర్స్ తోనూ, బూత్ కమిటీల అధ్యక్షులతోనూ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రణాళికలను వివరించారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా కరీంనగర్ కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభను కరీంనగర్ లో నిర్వహించింది. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఒకే రోజు ఎన్నికల దిశగా మూడు రకాల వ్యూహలతో కదలడం అనేది తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. మూడు పార్టీల లక్ష్యం మెజార్టీ ఎంపీ సీట్ల సాధనే.

అయితే, ఆ లక్ష్య సాధన దిశగా ఎంతవరకు ఈ మూడు పార్టీలు ముందుకు వెళ్తాయి. తెలంగాణ రాజకీయం ఏ రకంగా మారబోతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుంది? కాంగ్రెస్ సంక్షేమ ప్రణాళిక ఫలిస్తుందా? లేదంటే బీజేపీ జైశ్రీరామ్ నినాదం కలిసి వస్తుందా? మోదీ మ్యాజిక్ మూడోసారి పని చేయబోతోందా? బీఆర్ఎస్ పై సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

Also Read : కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, సమైక్య పాలకులే నయం, నేను గెలిచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని- కేసీఆర్