తాను త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్కడున్న వారితో చర్చించి..తెలంగాణ వాసులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. NRIC పాలసీ కావాలని గల్ఫ్‌లో ఉన్న వారు డిమాండ్స్ చేస్తున్నారని, అక్కుడన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని రాష్ట్రాల్లో పాలసీలు ప్రకటించాయని వెల్లడించారు.
దీనిపై చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు కేరళకు వెళ్లి అధ్యయనం చేశారని, ఈ క్రమంలో తాను త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మంత్రులు, శాసనసభ్యులు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తామన్నారు.
అసలు దుబాయ్ ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కన్ స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాకుండా..ఇతర రాష్ట్రాలకు చెందని వారు ఉంటున్నారని తెలిపారు. నెలకు కనీసం రూ. 35 వేలు వచ్చిన ప్రాంతంలో పనిచేయకుండా..గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని తెలిపారు.
కన్నవారిని విడిచిపెట్టి..అప్పులు చేసి..అక్కడకు వెళ్లి ఇబ్బందులు పడడం ఎందుకని ప్రశ్నించారు. ఇక్కడ మిస్ లీడింగ్ ఉందని, ఈ విషయంలో తాను గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అక్కడున్న వారితో మాట్లాడడం, కంపెనీలు, అంబాసిడర్‌తో మాట్లాడి ఒక పరిష్కారం దొరికే విధంగా చూస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Read More : KTR సీఎం పదవిపై KCR వ్యాఖ్యలు