సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తారా?

  • Publish Date - November 3, 2019 / 01:36 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారని..అంటూ కామెంట్స్ చేస్తున్నారని..కానీ..అంబేద్కర్..కాన్షీరాం..ఇతరులు కూడా పరాజయం చెందారని గుర్తు చేశారు. తనను ఎన్నికల్లో నమ్మలేదు..ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డానంటే..దెబ్బతిని మళ్లీ పైకి లేస్తా అంటూ చెప్పారు. 2019, నవంబర్ 03 ఆదివారం జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు.

వైసీపీ మంత్రి బోత్స నారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డిలపై విమర్శలు గుప్పించారు. వ్యక్తులకు తాను చాలా గౌరవం ఇస్తానని, 2004లో నన్ను ఎమీ అనవద్దని బోత్స కబరు పంపించారని తెలిపారు. విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారని, ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తి కాదని..జీవితంలో చాలాసార్లు దెబ్బలు తిన్నానని తెలిపారు. ఎన్నికల్లో నిలబడలేకుండా..దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను రాజ్యసభకు పంపిస్తారని, కానీ..సూట్ కేసులు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తుంటే..సమాధానం చెప్పాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నారు.

రెండు సంవత్సరాల జైలులో ఉన్న వ్యక్తి విమర్శలు చేస్తారా ? తనకు భయం లేదని..ఇంటి ముందు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందన్నారు. కర్నాటక రాష్ట్రంలో ఓ దేవాలయ పునర్ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడకు రావడం జరిగిందని, అక్కడ వందల మంది పోలీసులు వచ్చారన్నారు. పోలీసులు వారి డ్యూటీ చేయడం ప్రథమ కర్తవ్యమన్నారు పవన్ కళ్యాణ్. 
Read More : శాడిస్టు ప్రభుత్వం : పవన్‌ను టీడీపీ దత్తపుత్రుడు అంటారా – అచ్చెన్నాయుడు