ఆర్టీసీ కార్మికులకు మరో గుడ్ న్యూస్ : సమ్మె కాలంలో జీతాలు ఇస్తాం- కేసీఆర్

  • Publish Date - December 1, 2019 / 10:23 AM IST

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు. 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

బస్సుల్లో టికెట్ తీసుకోకపోతే కండక్టర్‌కు విధిస్తున్న పెనాల్టీని ప్రయాణీకులపై వేయాలని డిసైడ్ అయ్యారు. ఆర్టీసీ మనుగడ కోసం కష్టించి పనిచేయాలని కార్మికులకు సూచించారు. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వీరికి డిపోల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. 

తమ డిమాండ్లు పరిష్కరించాలని 52 రోజులుగా కార్మికులు చేసిన సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు కఠినంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్..కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని సూచించారు. దీంతో కార్మికుల్లో సంతోషం పెల్లుబికింది. 

ఆర్టీసీ కార్మికులతో చర్చించి..సమస్యలను పరిష్కరిస్తామన్న కేసీఆర్..అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నారు. వారితో భేటీ కావాని..ఇందుకు 92 డిపోలకు చెందిన కార్మికులకు ఆహ్వానించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రతి డిపోలో ఐదుగురు కార్మికులు..అందులో ఇద్దరు మహిళా కార్మికులు ఉండాలని సూచించారు.

డిసెంబర్ 01వ తేదీ సోమవారం ప్రగతి భవన్‌లో కార్మికులతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ సంస్థపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కానీ ఈ సమావేశానికి మాత్రం ఆర్టీసీ జేఏసీ యూనియన్ నేతలను మాత్రం పిలవలేదు. మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన కార్మికులు..సీఎం కేసీఆర్ నిర్ణయం బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లైంది. సమావేశం ముగిసిన అనంతరం ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 
Read More : మోడీకి KTR ట్వీట్ : అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలి