పెద్దపల్లి రాజకీయాలు : వివేక్ సంచలన నిర్ణయం

  • Publish Date - March 25, 2019 / 05:47 AM IST

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్..వెంకటేశ్ నేతకానికి టికెట్ కన్ఫాం చేశారు. దీనితో ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఏ పార్టీలో చేరుతారు ? అనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. మార్చి 25వ తేదీ సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు వివేక్. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. 

పోటీ చేసేందుకు చాలా ప్రయత్నించడం జరిగిందని, సమయం తక్కువగా ఉన్నందున కొత్త గుర్తు ప్రజలకు చేరదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకని పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే తనకు టికెట్ రాలేదని మరోసారి చెప్పారు వివేక్. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దనే కుట్రతోనే ఆలస్యంగా ప్రకటించారని ఆయన అన్నారు. 

వివేక్‌కు సీటు ఇవ్వొద్దని కేసీఆర్‌కు పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు…2018 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం వివేక్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీనితో వెంకటేశ్ నేతకాని ఎంపీ టికెట్ ఇచ్చి బీఫాం ఇచ్చేశారు. వివేక్ దారి ఎటు అనే చర్చ జరిగింది. మార్చి 25వ తేదీ లోక్ సభకు నామినేషన్లు ఆఖరి రోజు కావడంతో ఆయన బీఎస్పీ తరపున పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వివేక్..అక్కడ ఇమడలేక 2016 జూన్‌లో అతని సోదరుడు మాజీ మంత్రి వినోద్‌తో కలిసి TRSలో చేరారు. 2016 నవంబర్‌ 30న కేసీఆర్‌..రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. ముందస్తు ఎన్నికల్లో వినోద్‌కు చెన్నూరు నుంచి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కలేదు. తాజాగా పోటీ చేయడం లేదని వివేక్ ప్రకటించారు. 

ట్రెండింగ్ వార్తలు