PM Modi : ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్..! ఎప్పుడంటే..

పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.

Tdp Janasena Bjp Public Meeting

PM Modi : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. ఈ నెల 17 లేదా 18న టీడీపీ-జనసేన-బీజేపీ నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ వస్తారని చెప్పారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని, ఎవరైనా సీట్లు కోల్పోవాల్సి వస్తే నిరుత్సాహ పడొద్దని సూచించారు చంద్రబాబు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించాలన్నారు చంద్రబాబు.

టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి భారీ బహిరంగ సభకు కూటమి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాని మోదీ హాజరవబోతున్నారని సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 2024 ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నాయి.

బీజేపీ, జనసేన పోటీ చేసే స్థానాలివే..!
* అరకు, అనకాపల్లి, నర్సాపురం లేదా ఏలూరు, రాజమండ్రి నుంచి లోక్ సభకు బీజేపీ పోటీ
* హిందూపురం, రాజంపేట నుంచి లోక్ సభకు బీజేపీ పోటీ
* కాకినాడ, మచిలీపట్నం నుంచి లోక్ సభకు జనసేన పోటీ

Also Read : సీట్ల సర్దుబాటుపై ముగిసిన చర్చలు.. బీజేపీ, జనసేన పార్టీలు పోటీచేసే ఎంపీ స్థానాలు ఇవే!?