Population surged during Congress rule due to less electricity says Union minister
Pralhad Joshi: అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం అత్యంత సాధారణం. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జరిగే తప్పులకు అంతకు ముందు అధికారంలో ఉన్నవారి చర్చలే కారణమని చూపే ప్రయత్నాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగా అప్పుడప్పుడు అసందర్భ వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు కనీసం లాజిక్‌గా కూడా స్పందించరు. తాజాగా కేంద్ర మంత్రి ఒకరు దేశంలో పెరిగిన జనాభా మీద స్పందిస్తూ అలాంటి వ్యాఖ్యలే చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇవ్వలేదట. అందుకే దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కర్ణాటక గురువారం నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి.. ఈ వాగ్దానం మీద స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
Maharashtra Budget: ‘పంచామృతాల బడ్జెట్’ ప్రవేశ పెట్టిన మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
‘‘కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తానని ఇప్పుడు అంటోంది. ఆ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తుందంటే మీరు నమ్ముతారా? వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ కోతలు మాత్రమే ఉండేవి. దేశంలోని చాలా గ్రామాల్లో అయితే అసలు కరెంటే లేకుండేది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అందరికీ 24 గంటల విద్యుత్ అందుతోంది’’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు (కాంగ్రెస్) చాలా తక్కువ కరెంట్ ఇచ్చేవాళ్లు. అందుకే ఈ దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది’’ అని అన్నారు.