President election lifts new groups in congress then started clashes
Congress President Election: కుమ్ములాటలకు కాంగ్రెస్ పార్టీలో కొదువ ఉండదు. వైరి పక్షాలపై పోరాటం కంటే సొంత పార్టీ నేతల ఆధిప్యత పోరుతోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సతమతమవుతూ ఉంటుంది. ఏదో ఒక కారణం, ఏదో ఒక సందర్భం నేతల మధ్య కుమ్ములాటకు దారి తీస్తూనే ఉంటుంది. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కొత్త గ్రూపులకు దారి తీయడమే కాకుండా, వారి మధ్య కుమ్ములాటకు కారణమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, సీనియర్ లీడర్ శశి థరూర్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక ఈ పోటీపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అమితాసక్తి చూపిస్తున్నారు. మరి కొంత మంది నేతలు కూడా పోటీకి సిద్ధమని ప్రకటించారు. వారు నామినేషన్లు వేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే తాజా వివాదాలకు కారణం అవుతోంది. పార్టీలోని నేతలు కార్యకర్తలు.. ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి అభ్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
గాంధీ కుటుంబం బలపర్చిన నేతగా అశోక్ గెహ్లోత్‌కు పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించొచ్చనే అంచనాలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఆయనకు మద్దతుగా శశి థరూర్‌పై గౌరవ్ వల్లభ్ విమర్శలు గుప్పించారు. గెహ్లోత్ మాత్రమే సరైన అభ్యర్థని, థరూర్ ఎనిమిదేళ్లుగా సోనియా గాంధీకి లేఖలు రాయడం తప్పితే పార్టీ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. శశికి మద్దతుగా దిగ్విజయ్‌కి మద్దతుగా కూడా పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ కుమ్ములాటలు ఎన్నిక ముగిసే నాటికి ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.
Congress President Election: రాహుల్ తప్పుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పెరుగుతోన్న పోటీ