Delhi: స్కూళ్లు బంద్, 50% ఉద్యోగులకు ఇంటి నుంచే పని, మరోసారి సరి-బేసి

ఢిల్లీలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 450 కంటే ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483 నమోదైంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అటు నోయిడాలోనూ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. సగం మంది ఉద్యోగులు ఇక ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది. అలాగే నగరంలో ట్రాఫిక్‭పై కూడా ఆంక్షలు విధించారు. వీటన్నిటికీ కారణం కాలుష్యం. కాలుష్యం విషయంలో ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నాలుగేళ్లుగా ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉంటూ వస్తోంది. అలాంటి ఢిల్లీ మరోసారి కాలుష్య విషయ వలయంలో చిక్కుకుంది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది.

ఐదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు పూర్తిగా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రైమరీ స్కూళ్లు తెరిచేందుకు అవకాశం లేదు. ఇక ఐదు, అంతకంటే పై తరగతుల విద్యార్థులకు అవుట్ డోర్ గేమ్స్ నిలిపివేశారు. నగరంలో గతంలో అవలంబించిన సరి-బేసి విధానాన్ని మరోసారి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రం హోం కేటాయించారు.

ఢిల్లీలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 450 కంటే ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483 నమోదైంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అటు నోయిడాలోనూ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.

TRS MLAs Trap Issue : ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు? : మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

ట్రెండింగ్ వార్తలు