TRS MLAs Trap Issue : ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు? : మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

ఎవరో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తానంటూ ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు?అంటూ టీఆర్ఎస్ పైనా..సీఎం కేసీఆర్ పైనా కేంద్రం కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫాంహౌస్ సీఎం మామీద విమర్శలు చేయటమా?అంటూ సెటైర్లు వేశారు.

TRS MLAs Trap Issue : ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు? : మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

Union Minister Kishan Reddy fire on CM KCR

Kishan Reddy fire on CM KCR TRS MLAs trap issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ కుట్ర పన్నింది అని..హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా? మీరు కూలుస్తానని కుట్రలు చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? తగిన బుద్ధి చెప్పి తీరుతాను..అంటూ మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై బీజేపీపై సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై బీజేపీ అధిష్టానం తీవ్రంగా మండిపడింది. కేసీఆర్ చేసిన ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టి మీరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. తిరిగి సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి యత్నించారంటూ టీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఈ ఫిర్యాదు తెలంగాణానే కాదు ఏకంగా ఢిల్లీ కాషాయదళాన్నే కదిలించింది.టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిధీటుగా సమాధానం ఇస్తూ..‘రోహిత్ రెడ్డి నీతిమంతుడా? ఎవరో కొంటానంటే..కోట్ల రూపాయలు ఇస్తానంటే ఫాంహౌస్ కు ఎగేసుకుంటూ వచ్చేసిన ఎమ్మెల్యేలు నీతిమంతులా? వారు ఏపార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అదే నీతిఅంటే అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

స్వామిజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయనుకుంటే..రోహిత్ రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందనుకుంటే తాము ఏమీ చేయలేమని..అంత వీక్ ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ సిగ్గుపడాలంటూ ఏకిపారేశారు.మాపార్టీ సిద్దాంతాలు నమ్మి వచ్చినవారే చేర్చుకుంటాం అంతేతప్ప స్వామీజీలతో లాలూచీలు చేయించాల్సిన అఘత్యం మాకు పట్టలేదన్నారు. స్వామీజీలతో డబ్బులు పంపించి మా పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు అంటూ స్పష్టం చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హత్య చేస్తోందంటూ బీజేపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానమిచ్చారు కిషన్ రెడ్డి. ‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్న సీఎం కేసీఆర్… దేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. సొంత పార్టీనేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీసి ఇదే నిజం అని చెప్పేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇది రోజురోజుకూ ఆయనలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతా భావానికి నిదర్శనం అని అన్నారు.

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్న ఆవేదనతో, తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ఫాంహౌస్ సీఎం.. పాత ముచ్చటనే పదే పదే చెప్పారు’ అని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌజ్ లో వుండే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? అంటూ ప్రశ్నించారు. సామాన్య ప్రజలను మీరు ఎపుడైనా కలిశారా? ఫామ్ హౌజ్ లో ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్దాన్ని వీడియోలో చూపించారంటూ సెటైర్లు వేశారు. నిన్నటి ఎపిసోడ్ చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ ఎలాగూ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ ప్రస్టేషన్ కు గురి అవుతున్నారని..ఇటువంటి పరిస్థితుల్లో తన కొడుకు కేటీఆర్ సీఎం కాలేడని కేసీఆర్ ఆందోళనకు గురి అయి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.