Telangana Lok Sabha Elections
Telangana Lok Sabha Elections : పార్లమెంటు ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో గెలిచేదెవరు? సీఎం రేవంత్ రెడ్డి రూటు మార్చి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే, ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టబోతున్నారు? బీజేపీ బలమెంత? కాంగ్రెస్ సత్తా ఎంత? బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఉన్న ఛాన్సులు ఏంటి?
రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయా? రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మాట అనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజంగా అలాంటి ప్రయత్నం ఏదైనా రానున్న లోక్ సభ ఎన్నికల్లో జరుగుతుందా? తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో కుట్ర జరుగుతోందని స్వయంగా సీఎం రేవంత్ ఆరోపణ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు వచ్చే సీట్ల సంఖ్యను, ఓటు బ్యాంకును తగ్గించే ప్రయత్నం జరుగుతోందా? బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి ఈ ప్లాన్ చేస్తున్నాయి అనే దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ సమగ్ర విశ్లేషణ..
గెలుపెవరిది?
తెలంగాణలో ఆసక్తికరంగా లోక్ సభ ఎన్నికలు
ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుంది అనేదానిపై ఉత్కంఠ
అధికార కాంగ్రెస్ సత్తా చాటుతుందా?
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలమెంత?
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఉన్న అవకాశాలు ఎంత?
బీజేపీ నెంబర్ 1 అయ్యే అవకాశాలు ఉన్నాయా?
కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది?
బీఆర్ఎస్ ఎంతమంది ఎంపీలను లోక్ సభకు పంపగలుగుతుంది?
సీఎం రేవంత్ సెంటిమెంట్ అస్త్రం పని చేస్తుందా?
Also Read : జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తామని బీజేపీ ఇంత ధీమాగా ఎందుకు ఉందో తెలుసా?