జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తామని బీజేపీ ఇంత ధీమాగా ఎందుకు ఉందో తెలుసా?

Zaheerabad: జెయింట్ కిల్లర్ గా ఉన్న రమణారెడ్డి మ్యాజిక్ ఎలా పనిచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తామని బీజేపీ ఇంత ధీమాగా ఎందుకు ఉందో తెలుసా?

Updated On : April 9, 2024 / 9:27 PM IST

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌, రేవంత్ రెడ్డిలను ఓడించి చరిత్ర సృష్టించి.. జాతీయ నాయకుల దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే ఆయనను జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించారు.

ఇప్పటివరకు ఈ లోక్‌సభలో బీజేపీ అభ్యర్థి గెలవకపోయినా.. ఈ సారి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఓటు బ్యాంకు అంతంత మాత్రంగానే ఉంది. మోదీ చరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం గెలిపిస్తాయని దీమాగా ఉన్నారు ఆ పార్టీ నేతలు.

టికెట్ కోసం పోటీ
జహీరాబాద్ టికెట్ ను 35 మందికి పైగా అభ్యర్థులు ఆశించారు. వాళ్లను కాదని, బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇచ్చారు. దీంతో టికెట్ ఆశించిన అభ్యర్థులు పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలుపార్టీ అభ్యర్ధితో అంటి ముట్టనట్లు ఉంటున్నారు.నేతల మద్య ఆధిపత్య పోరు, విబేధాలు, ఇబ్బందికరంగా మారాయి.

జహీరాబాద్ పార్లమెంట పరిధిలో గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధి బానాల లక్ష్మారెడ్డి మూడో స్దానానికి పరిమితం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్ధులందరికి కలిపి లక్షా 72వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం మరో మూడున్నర లక్షలకు పైచిలుకు ఓట్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్దితుల్లో.. జెయింట్ కిల్లర్ గా ఉన్న రమణారెడ్డి మ్యాజిక్ ఎలా పనిచేస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు సాగడం ఎమ్మెల్యేకు అసలు సవాలుగా మారింది.

బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్.. కాషాయ దళంపై పూర్తిగా ఆధారపడకుండా..తన సొంత టీంతో ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సీనియర్లకు మింగుడు పడటం లేదు. పాటిల్ జహీరాబాద్‌లో హ్యాట్రిక్ కొట్టి.. కాటిపల్లి తలపై భారాన్ని దించుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

 వైసీపీ ఓట్లను కాంగ్రెస్‌ చీల్చగలదా? త్రిముఖ పోటీతో రసవత్తరంగా చింతలపూడి రాజకీయం