Raghunandan Rao : జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయి- రఘనందన్ రావు

షేక్ పేటలో జరుగుతున్న భూబాగోతాలపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను.

Raghunandan Rao Madhavaneni : జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడంపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వారికి ఫండింగ్ చేయబోతున్నారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు.

”రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నేతలు తమ తమ అవసరాలకు అనుకూలంగా మారుతున్నారు. బీజేపీలోకి కూడా అలాగే వచ్చారు. బీజేపీలో వచ్చిన సమయంలో ఒకరకంగా మాట్లాడుతున్నారు. బీజేపీలోకి వచ్చినప్పుడు సిద్ధాంతం ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు సిద్ధాంతం లేదు అంటున్నారు. బీజేపీలో మీ కొడుక్కి టికెట్ ఇస్తే సిద్ధాంతం ఉన్న పార్టీ. మీకు టికెట్ రాకపోతే సిద్ధాంతం లేని పార్టీ..? ఆ పార్టీలోకి వెళ్లడంపైన ఏ కన్ స్ట్రక్షన్ కంపెనీకి లాభం చేకూర్చునేందుకు మీరు కాంగ్రెస్ లోకి వెళుతున్నారు?

జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి మారడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటి? దాని ద్వారా మీ ఆర్థిక ప్రయోజనాలు ఏంటి..? మీకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి..? మాకు అన్నీ తెలుసు. పూర్తి సమాచారం మా వద్ద ఉంది. బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందరికంటే ఎక్కువ లబ్ది పొందిన ఎంపీ రంజిత్ రెడ్డి. షేక్ పేటలో జరుగుతున్న భూబాగోతాలపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వారికి ఫండింగ్ చేయబోతున్నారు” అని రఘునందన్ రావు అన్నారు.

Also Read : తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా

 

ట్రెండింగ్ వార్తలు