Priyanka Gandhi and Rahul Gandhi
Congress Party: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో రాహుల్ గాంధీ ((Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi vadra) భిన్న అభిప్రాయాలతో ఉన్నారట. రాహుల్ గాంధీనేమో సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah)ను ముఖ్యమంత్రిని చేయాలని సూచిస్తుండగా.. డీకే శివకుమార్(DK Shivakumar)ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రియాంక గాంధీ సముఖత వ్యక్తం చేశారట. అయితే సోనియా గాంధీ (Sonia Gandhi) సైతం సిద్ధరామయ్యవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Tamil Nadu : తమిళనాడులో విషాదం.. కల్తీ మద్యం తాగి 13 మంది మృతి
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసు జోరుగా సాగుతోంది. ఈ రేసు మాజీ సీఎం సిద్ధారమయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించనున్నారు. ఇక సీఎం రేసులో ఉన్న డీకేకు ఢిల్లీ నుంచి ఇంకా పిలుపే రాలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే సోమవారం తాను ఢిల్లీకి వెళ్లే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు.
Karnataka CM: డీకేకు రాజస్థాన్ భయం.. సిద్ధరామయ్య చేసిన సీఎం షేరింగ్ ప్రతిపాదను ‘నో’
అయితే ముఖ్యమంత్రి పదవిపై సిద్ధారమయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి రెండేళ్లు తాను సీఎంగా ఉంటానని, అనంతరం మూడేళ్లు డీకేకు ఇవ్వాలని సిద్ధరామయ్య సూచించారట. అయితే సిద్ధరామయ్య పెట్టిన ప్రతిపాదనకు డీకే శివకుమార్ నో చెప్పారు. రాజస్థాన్ వంటి పరిణామాలు కర్ణాటకలో కూడా చోటు చేసుకుంటాయని డీకే ఆందోళన చెందుతున్నారట. అయితే సిద్ధరామయ్య చేసిన ప్రతిపాదనకు మాత్రం రివర్సులో డీకే ఆమోదించారు. మొదటి మూడు సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత రెండేళ్లు సిద్ధరామయ్యకు ఇవ్వాలని డీకే అభిప్రాయపడ్డారట.