Karnataka CM: డీకేకు రాజస్థాన్ భయం.. సిద్ధరామయ్య చేసిన సీఎం షేరింగ్‭ ప్రతిపాదను ‘నో’

ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సంబంధించిన నివేదికను ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందం సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది

Karnataka CM: డీకేకు రాజస్థాన్ భయం.. సిద్ధరామయ్య చేసిన సీఎం షేరింగ్‭ ప్రతిపాదను ‘నో’

DK vs Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య పెట్టిన ప్రతిపాదనకు డీకే శివకుమార్ నో చెప్పారు. రాజస్థాన్ వంటి పరిణామాలు కర్ణాటకలో కూడా చోటు చేసుకుంటాయని డీకే ఆందోళన చెందుతున్నారట. అయితే సిద్ధరామయ్య చేసిన ప్రతిపాదనకు మాత్రం రివర్సులో డీకే ఆమోదించారు. మొదటి మూడు సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత రెండేళ్లు సిద్ధరామయ్యకు ఇవ్వాలని డీకే అభిప్రాయపడ్డారట.

Karnataka Election Result: కాంగ్రెస్ విజయంలో మా కృషి కూడా ఉంది.. డిప్యూటీ సీఎం, ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే..

ఎక్కువమంది ఎమ్మెల్యేలు తననే సీఎంగా కోరుకుంటున్నారని, తొలి రెండేళ్లు తననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, మిగతా మూడేళ్లు డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానానికి సిద్ధరామయ్య సూచించారట. వయసైపోతున్నందున తొలి రెండేళ్ల పాలనకు తానే సారధ్యం వహించాలని భావిస్తున్నట్టు, కనీసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకైనా సీఎంగా కొనసాగాలని సిద్ధూ భావిస్తున్నట్టు వెల్లడించాయి. ఇది తన ప్రతిపాదన మాత్రమేనని, తుది నిర్ణయాన్ని అధిష్టానం అభీష్టానికే వదిలేస్తున్నట్టు సిద్ధరామయ్య పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Mallikharjuna Kharge : భ‌జ‌రంగ్‌ద‌ళ్‌పై సంచలన వ్యాఖ్యలు.. మల్లిఖార్జున ఖర్గేపై ప‌రువున‌ష్టం కేసు నమోదు

రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ కూడా కర్ణాటక లాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య ముఖ్యమంత్రి కుర్చీపై వివాదం ఏర్పడింది. అయితే సీఎం సర్దుబాటు ఒప్పందంతో సీనియారిటీ ప్రకారం గెహ్లాట్‭ను ముఖ్యమంత్రి చేశారు. అయితే సమయం అయిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగారు. దీంతో సచిన్ పైలట్ తిరుగుబాటు నేతగా మారారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఉత్కంఠ స్థాయిలో కొనసాగుతోంది.

Karnataka CM: ఢిల్లీ చేరుకున్న పరిశీలకులు.. కర్ణాటక సీఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గేకు నివేదిక

ఇదే పరిస్థితి కర్ణాటకలో రావొచ్చని డీకే ఆందోళన చెందుతున్నారు. అందుకే సిద్ధరామయ్య పెట్టిన ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ఇక ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సంబంధించిన నివేదికను ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందం సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఇంతలో, పార్టీ సీనియర్ నేతలను కలవడానికి సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరారు. మరి ఎవరిని ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయిస్తుందో చూడాలి.