Karnataka CM: ఢిల్లీ చేరుకున్న పరిశీలకులు.. కర్ణాటక సీఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గేకు నివేదిక

ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం

Karnataka CM: ఢిల్లీ చేరుకున్న పరిశీలకులు.. కర్ణాటక సీఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గేకు నివేదిక

Congress: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆదివారం సమావేశమైన ముగ్గురు సభ్యుల పరిశీలకుల కమిటీ ఆదివారం మద్యాహ్నం ఢిల్లీ చేరుకుంది. సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ నేత సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‭లలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో తెలియక అధిష్టానం సైతం తర్జనభర్జన అవుతోంది.

TSRTC: ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఈ-గరుడ పేరుతో అందుబాటులోకి

దీన్ని పరిష్కరించేందుకే ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం. తనకు వృద్ధాప్యం ఉన్నందున, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల వరకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి సగభాగం అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆయన సూచించారట.

Supreme Court : గంగా, యమునా నదుల ప్రక్షాళనపై దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

అయితే డీకే శివకుమార్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని, అందుకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోని సందర్భాలను ఉదహరించినట్లు చెబుతున్నారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఇంతలో, పార్టీ సీనియర్ నేతలను కలవడానికి సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరారు.