Karnataka Election Result: కాంగ్రెస్ విజయంలో మా కృషి కూడా ఉంది.. డిప్యూటీ సీఎం, ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే..

కర్ణాటకలోని సున్నీ ఉలేమా బోర్డు ముస్లిం నేతలు కాంగ్రెస్ పార్టీకి కీలక ప్రతిపాదన చేశారు. ముస్లిం ఎమ్మెల్యేలు తొమ్మిది మంది గెలిచారు. మాకు డిప్యూటీ సీఎంతో పాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Karnataka Election Result: కాంగ్రెస్ విజయంలో మా కృషి కూడా ఉంది.. డిప్యూటీ సీఎం, ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే..

Waqf Board chairman Shafi Sadi

Waqf Board chairman: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శికుమార్ మధ్య పోటీ నెలకొంది. అధిష్టానం వీరిద్దరిలో ఎవరి పేరు ప్రకటిస్తుందనే అంశం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా ఉత్కంఠతను రేపుతుంది.  మరోవైపు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు మంత్రి పదవులు దక్కించుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని సున్నీ ఉలేమా బోర్డు ముస్లిం నేతలు కీలక డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో తమ కృషికూడా ఉందని, ముస్లింలకు ఒక డిప్యూటీ సీఎం, ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ఐదు శాఖల వివరాల పేర్లనుకూడా వాళ్లే చెప్పేశారు.

Karnataka CM Candidate : కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. అధిష్టానానిదే తుది నిర్ణయం, ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ కు పిలుపు

వక్ఫ్ బోర్డు చైర్మన్ షఫీ సాదీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ముస్లింలకు 30 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ముందే చెప్పాం. కానీ మాకు 15 సీట్లు ఇచ్చారు. వీరిలో తొమ్మిది మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ 72 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంలో ముస్లింలు కీలక భూమిక పోషించారు. ఒకవిధంగా చెప్పాలంటే ముస్లింల వల్లనే ఆ 72 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సునాయాసమైందని అన్నారు. ముస్లింల సంఘం తరపున ముస్లింలను అందరిని ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించాం. ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ నుంచి ముస్లింలకు ఒక డిప్యూటీ, ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని కోరటంలో తప్పులేదు.

Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విజయం గురించి ఏమన్నారంటే..

డిప్యూటీ సీఎంతో పాటు హోం, రెవెన్యూ, హెల్త్ వంటి కీలక శాఖలు ముస్లిం ఎమ్మెల్యేలకే కేటాయించాలి.  మా పట్ల కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చూపాల్సిన బాధ్యత ఉందని షఫీ సాదీ అన్నారు. అయితే, ఇటీవల విజయం సాధించిన తొమ్మిది మంది ముస్లింల ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవచ్చని తెలిపారు.

MVA Meet: మహారాష్ట్రకు కిక్ ఇచ్చిన కర్ణాటక.. పవార్ ఇంట్లో ప్రతిపక్షాల కీలక భేటి

కర్ణాటక రాష్ట్రంలో సుమారు 90లక్షల మంది ముస్లింలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు కాకుండా అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీ మాది. ముస్లిం అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లోనేకాకుండా ఇతర అభ్యర్థుల నియోజకవర్గాల్లోనూ చాలాచోట్ల ప్రచారం చేశారు. హిందూ, ముస్లిం ఐక్యతకు భరోసా ఇస్తూ ప్రచారం చేశారు. తద్వారా కాంగ్రెస్ భారీ విజయంలో ముస్లిం అభ్యర్థులు, ముస్లింల ఓటర్లు కీలక భూమిక పోషించారని వక్ఫ్ బోర్డు చైర్మన్ షఫీ సాదీ అన్నారు. మరి వీరి డిమాండ్‌ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.