Karnataka CM Candidate : కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. అధిష్టానానిదే తుది నిర్ణయం, ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ కు పిలుపు

ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.

Karnataka CM Candidate : కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. అధిష్టానానిదే తుది నిర్ణయం, ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ కు పిలుపు

Karnataka CM candidate

Congress High Command : కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మేల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

నిన్న ఆదివారం అర్ధరాత్రి 1:30 వరకు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు.  ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సోమవారం ఖర్గేకు తెలపనున్నారు.

ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.  ఇక ఖర్గే నిర్ణయం కోసం కన్నడ ప్రజలు ఎదురుచూస్తున్నారు. సీంఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ ల మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగళూరులో పోటాపోటీ పోస్టర్లు వెలిశాయి. మరోవైపు సీఎల్పీ సమావేశం జరుగుతున్నా హోటల్ ముందు సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ మద్దతుదారులు పోటాపోటీగా నినాదాలు చేశారు.

Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విజయం గురించి ఏమన్నారంటే..

డీకే.శివకుమార్ సీఎం అంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లను ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో సోమవారం ఇద్దరు నేతలు హస్తిన బాట పట్టనున్నారు. మరోవైపు నిన్న ఆదివారం మధ్యాహ్నమే ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

సీఎం అభ్యర్థిపై చర్చలు జరిపారు. కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న సస్పెన్స్ కు తెర పడకపోయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 18న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించాలంటూ కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం పూర్తిస్థాయి కసరత్తును పూర్తి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Karnataka: సీఎం అవుతారన్న ఊహాగానాల మధ్య.. మఠంలో స్వామీజీని దర్శించుకున్న డీకే శివకుమార్

సీఎం అభ్యర్థిని కూడా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అంతలోపు సీఎం రేసులో ఉన్న ఇద్దరు నేతలతోనూ చర్చలు జరుగనున్నాయి. ఏఐసీసీ పరిశీలకుల నివేదిక ఆధారంగా సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు సీఎం ప్రమాణ స్వీకారానికి దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలను ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా సారూప్య భావజాలం ఉన్న పార్టీలను తప్పకుండా ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక సీఎం అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి సవాల్ గా మారింది. అయితే అధిష్టానం ముందు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డీకే.శివకుమార్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించడం లేకపోతే ఇప్పటికే సీఎంగా పని చేసిన అనుభవం ఉన్న సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వడం, ఇదీ కుదరకపోతే డీకే.శివకుమార్, సిద్ధరామయ్యకు చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వడం అనేది అధిష్టానం ముందున్న ఆప్షన్లు.

Karnataka: మంగళవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.. ఇంతకీ కొత్త సీఎం ఎవరో తెలుసా?

దీనికి డీకే.శివకుమార్, సిద్ధరామయ్య ఒప్పుకోకపోతే వీరిద్దరినీ కాదని మరో నేతకు అవకాశం ఇవ్వడం వంటి ఆప్షన్స్ కాంగ్రెస్ అధిష్టానం ముందున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలు ఒక్క ఎత్తైతే, సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం మరో ఎత్తు అయింది. నేడు (సోమవారం) కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ పుట్టినరోజు.  డీకే.శివకుమార్ కు బర్త్ డే గిఫ్ట్ గా సీఎం పదవి ఇస్తారని ఆయన అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్నారు. శివకుమార్ కు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శివకుమార్ ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు వెలిశాాయి.

డీకే.శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరి పేర్లు ప్రధానంగా సీఎం రేసులో వినిపిస్తున్నాయి.  నిబద్దత గల కాంగ్రెస్ కార్యకర్తగా డీకే.శివకుమార్ కు మంచి పేరు ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రలోభాలకే కాదు కేసుల వంటి బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్ బలోపేతానికి కష్ట పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి దగ్గర నుంచి కాంగ్రెస్ ను కన్నడ బీజం వైపు నడిపించేందుకు వ్యూహాలు రచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా శ్రమించారు.

Karnataka: కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందో చెప్పేసిన కాంగ్రెస్

అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, అగ్ర నేతల పర్యటన, ఎన్నికల మేనిఫెస్టో, హామీల వంటి వాటిపై డీకే.శివకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ కార్యర్తలందరినీ కలుపుకుపోయారు. సిద్ధరామయ్యతో విభేదాలున్నప్పటికీ పార్టీ ప్రయోజనాల కోసం అన్నింటినీ పక్కన పెట్టారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా కన్నడ నాట కాంగ్రెస్ అఖండ విజయంలో డీకే. శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కాగా, డీకే.శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనపై స్పష్టత లేదు.