Karnataka: కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందో చెప్పేసిన కాంగ్రెస్

కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తమ మిత్రపక్షాలకు ఆహ్వానం పంపింది.

Karnataka: కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందో చెప్పేసిన కాంగ్రెస్

Karnataka

Karnataka CM: కర్ణాటక సీఎం ఎంపిక, కాంగ్రెస్ (Congress) సీఎల్పీ సమావేశాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge). మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ నాయకులు జితేంద్ర సింగ్‌, ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియాతో కమిటీ ఏర్పాటైంది.

కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో వీరు పాల్గొంటున్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయంపై హైకమాండ్‌కు నివేదికను సమర్పిస్తారు. పరిశీలకులు పంపిన నివేదిక ఆధారంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించనుంది కాంగ్రెస్ అధిష్ఠానం.

సీఎం రేసులో ఇప్పుడు ఇద్దరు కాదు.. ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య, శివకుమార్ పేర్లే ఇప్పటివరకు వినపడ్డాయి. ఇప్పుడు మూడో నేత గురించి కూడా కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరన్నది బయటకు రాలేదు.

మిత్రపక్షాలకు ఆహ్వానం

సీఎం అభ్యర్థి విషయంపై ఖర్గే మాట్లాడారు. సోమవారం లేదా మంగళవారం కాబోయే సీఎం పేరును వెల్లడిస్తామని చెప్పారు. కర్ణాటక రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమకు ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం అభ్యర్థి విషయంలో ఎలాంటి వివాదమూ లేదని చెప్పారు.

కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం గురువారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా సీఎంను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తమ మిత్రపక్షాలకు ఆహ్వానం పంపింది.

CM of Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనేనా? ఇంతకీ కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో ఏముంది?