Rahul Gandhi on Savarkar: సావర్కర్ భావజాలంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్‭ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Rahul Gandhi on Savarkar: వీర సావర్కర్ మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలవంతులకు తలొగ్గడమే సావర్కర్ భావజాలమని ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్‭ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Kashmiri Pandit: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి

బలమైన ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో ఎలా ఫైట్ చేస్తామని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. అయితే జయశంకర్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ”భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలను శంకిస్తూ మాట్లాడిన ఆ మంత్రి పేరును ప్రస్తావించదలచుకోలేదు. ఇది నిశ్చయంగా బలవంతులకు తలవంచడమే. ఇది సావర్కర్, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాతో ఎలా పోరాడగలమని అనడం దేశభక్తి ఎంతమాత్రం కాదు. అది పిరికితనం” అని రాహుల్ అన్నారు.

Punjab: పంజాబ్‌లో లా అండ్ ఆర్డర్ విఫలం.. కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాజీ సీఎం అమరీందర్ సింగ్

ఇక భారత్ జోడో యాత్రలో తన అనుభవాలను పార్టీ శ్రేణులతో రాహుల్ పంచుకున్నారు. యాత్రలో నాకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు వేలాది మంది కనెక్ట్ అయ్యారని అన్నారు. రైతులు, అన్నివర్గాల ప్రజల సమస్యలను నేను విన్నానని, వారి బాధను తెలుసుకున్నానని రాహుల్ చెప్పారు. మహిళలు, యువత బాధను స్వయంగా తెలుసుకున్నానని అన్నారు. వర్షాలు, ఎండలను కూడా లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొనడం జరిగిందని రాహుల్ చెప్పారు.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, బీజేపీ దానిని దూరం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మాకు, వాళ్లకు ఉన్న వ్యత్యాసం అదేనంటూ బీజేపీ పై రాహుల్ విమర్శలు చేశారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విద్వేష ప్రచారం ద్వారా దేశాన్ని ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో చివరిగా జమ్మూ కశ్మీర్ లో తాను అడుగు పెట్టినప్పుడు ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి కశ్మీర్ లో పర్యటించినందుకు తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని రాహుల్ గుర్తు చేశారు. కశ్మీర్ లో మతం పేరుతో యువత వివక్షకు గురువుతోందంటూ రాహుల్ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు