Vande Bharat Express: వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

Updated On : February 26, 2023 / 5:06 PM IST

Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లపై రాళ్ల దాడి కొనసాగుతూనే ఉంది. దేశంలో అనేక చోట్ల దుండగులు వందే భారత్ రైళ్లపై దాడులు చేస్తున్నారు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో రాళ్లు విసిరేస్తున్నారు.

Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఈ నెల ప్రారంభంలో విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది.

Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు

మహబూబ్ నగర్ జిల్లాలో రైలు వెళ్తున్న సమయంలో, కొందరు పిల్లలు రైలుపై రాళ్ల దాడి చేసినట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దేశవ్యాప్తంగా ఇతర రైళ్లపై కూడా అనేక చోట్ల రాళ్ల దాడి జరుగుతోంది. గత ఏడాది దేశంలో రైళ్లపై 1,500 రాళ్ల దాడి ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనేక రైళ్లపై రాళ్ల దాడి జరుగుతున్నా.. వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండటం లేదు. కానీ, వందే భారత్ రైళ్లపై జరుగుతున్న దాడులు మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.