కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు

  • Publish Date - November 29, 2019 / 08:37 AM IST

ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్‌ కోర్టుకు పంపగలదన్నారు సీఎం కేసీఆర్‌. అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడతాయని, కానీ తాము అలా చేయడం లేదని చెప్పారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ. 100 కోట్లు ఇస్తున్నానని ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో 2019, నవంబర్ 29వ తేదీ శుక్రవారం కార్మికులు విధుల్లోకి చేరారు. పలువురు కార్మికులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ఆర్టీసీ కార్మికులు సంతోషంగా విధుల్లోకి చేరారు. దీంతో ఈ రోజు ఆర్టీసీ బస్సులు యధాతథంగా తిరుగుతున్నాయి. ఇన్నిరోజులు బస్సులు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బంది పడగా.. నేటి నుంచి ఆ సమస్య తీరింది. ఎప్పటిలాగానే సమయానికి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

> సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు స్వీట్లు తినిపించుకున్నారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
> ఎలాంటి షరతులు లేకుండా డ్యూటీలో చేరాలని సీఎం చెప్పడం అభినందనీయమన్నారు. కార్మికుల అందరి తరపున కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నాం అని చెప్పారు.
> చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చి అదుకుంటామని చెప్పడం .. వారికి పునర్జన్మ లాంటిదని ధన్యవాదలు తెలిపారు.
> ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలను కిలోమీటరుకు ఏకంగా 20 పైసల చొప్పున పెంచేశారు. 
> సోమవారం నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. 
> సమ్మె కాలంలో తాత్కాలికంగా పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
> ఆర్టీసీ కార్మికులు బెదిరించినా, అవమానించినా భరిస్తూ కష్టకాలంలో పని చేశారన్నారు. భవిష్యత్తులో
> తప్పకుండా మీ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.
Read More : ఆర్టీసీ ప్రక్షాళనకు కేసీఆర్ రెడీ : కార్మికులతో సమావేశం డేట్ ఫిక్స్