Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమికి 17, అధికార వైసీపీకి 8 లోక్‌సభ సీట్లు దక్కుతాయని సీ ఓటర్ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. సీ ఓటర్ సర్వేపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. సీ ఓటర్ సర్వేపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీ ఓటర్ అనే సంస్థ 2019లో వైసీపీకి 10 సీట్లు అని రిపోర్ట్ ఇచ్చిందని సజ్జల గుర్తు చేశారు. కానీ, 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏంటో అందరికీ తెలుసు అన్నారు. ”సీ ఓటర్ విశ్వసనీయత 2019లోనే తెలిసింది. ఇలాంటి విశ్వసనీయత లేని సర్వేలతో నాలుగు ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. సీ ఓటర్ అప్పుడూ అలాగే చెప్పింది.. చివరికి ఏమైందో అందరికీ తెలుసు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!
ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపైనా ఆయన స్పందించారు. ”రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రధానిని కలవడం సర్వసాధారణంగా జరిగేదే. రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రధానితో చర్చిస్తారు. అనేక ప్రాజెక్టుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది” అని సజ్జల తెలిపారు.
టీడీపీ బలహీనంగా ఉందని చెప్పడానికి అయన పొత్తుల ప్రయత్నాలే నిదర్శనం. టీడీపీకి అంత బలం ఉంటే పొత్తుల కోసం ఇంత ఆరాటం ఎందుకు..? షర్మిల పూర్తిగా చంద్రబాబు లైన్ లోనే ఉన్నారు. చంద్రబాబు ఏమీ చెబితే అదే మాట్లాడుతున్నారు. షర్మిల టీడీపీకి అద్దె మైకు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా మాకు ఒకటే. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన చేదు అనుభవాలు మాకు గుర్తే ఉంటాయి.
అందుకే ఫలితం అనుభవిస్తున్నారు. ఈరోజు జీరో అయ్యింది. టీడీపీ బలం 18. మా దగ్గర నుండి వెళ్ళిన వారు నలుగురు. రాజ్యసభ స్థానం కావాలంటే 20 ఓట్లకు పైగా కావాలి. అంత గ్యాప్ ఫిల్ చెయ్యడం వాళ్ళ వల్ల కాదు. పోటీ పెట్టినా రాజకీయ డ్రామాలో భాగమే. ఒకరిద్దరు తలకు మాసిన వాళ్ళు వెళ్ళినా అంత సీన్ లేదు” అని సజ్జల అన్నారు.
Also Read : లోక్‌సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు..