2024 Elections: న్యూఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నివాసంలో బుధవారం (సెప్టెంబర్ 13) విపక్ష కూటమి ఇండియా సమన్వయ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఇందులో 12 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేసి ఈ మేరకు సమాచారం అందించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించిందని, (కూటమి) సభ్య పక్షాలు చర్చలు జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇక, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్లు వేణుగోపాల్ తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, బీజేపీ అవినీతి సమస్యలపై అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో కూటమి తొలి బహిరంగ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు 20 సీట్లకు మించి రావు- బండి సంజయ్ జోస్యం
కొన్ని మీడియా గ్రూపులకు చెందిన కొందరు యాంకర్ల షోలలో ఇండియా గ్రూప్‌లోని ఏ నాయకుడూ పాల్గొనకూడదని కూడా నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. కూటమి సమన్వయ కమిటీ సమావేశం అనంతరం బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ మాట్లాడుతూ, సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని, అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. త్వరలో సీట్ల పంపకాలపై చర్చ జరగనుందని, అలాగే కులగణన మీద చర్చ ఉంటుందని తేజశ్వీ తెలిపారు.
ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. సీట్ల పంపకంపై వీలైనంత త్వరగా అన్ని పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని.. తొలి వారంలో భోపాల్‌లో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ లో కులగణన అంశం లేవనెత్తనున్నట్లు వెల్లడించారు.
Delhi: బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కాషాయ నేతలు
జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, “సమయం రానివ్వండి. దేశ ప్రజలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందనేది కేసీ వేణుగోపాల్ చెప్పారు. అన్ని పరిణామాలను గమనిస్తూ ఇండియా కూటమి తన వ్యూహంపై కసరత్తు చేస్తోంది’’ అని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, “ఇప్పటికే ఇండియా కూటమి సభ్యులకు ఉన్న సీట్లను చర్చించకూడదని, బీజేపీ, ఎన్డీయే లేదా ఇతర పార్టీలతో ఉన్న సీట్లపై చర్చించాలని నేను సమావేశంలో ప్రతిపాదించాను” అని అన్నారు.
సమావేశానికి ఎవరు హాజరయ్యారు?
కాంగ్రెస్‌కు నుంచి కేసీ వేణుగోపాల్, డీఎంకే నుంచి టీఆర్‌బాలు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజశ్వీ యాదవ్, జనతాదళ్ (యునైటెడ్) సంజయ్ ఝా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డీ రాజా, సమాజ్ వాదీ పార్టీ నుంచి జావేద్ అలీ ఖాన్ హాజరయ్యారు. బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయ పగ కారణంగా టీఎంసీ నుంచి హాజరు కావాల్సిన అభిషేక్ బెనర్జీ హాజరు కాలేకపోయారని కేసీ వేణుగోపాల్ తెలిపారు.