Maharashtra Politics: శరద్ పవార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తిరుగుబాటు నేత అజిత్ పవార్

అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్‌ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

NCP vs NCP: శరద్ పవార్ (Sharad Pawar) మీద తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ (Ajit pawar) ఉన్నట్టుండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్‌ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్‌ తట్కరేను ఎన్నుకున్నట్లు సీనియర్‌ నేత ప్రఫుల్ పటేల్‌ ప్రకటించారు.

Bihar Politics: మహారాష్ట్ర తర్వాత టార్గెట్ బిహారేనా? అప్పుడే లాలూ, తేజశ్వీ, రబ్రీదేవిల‭పై సీబీఐ చార్జిషీట్

అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్‌ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ప్రఫుల్‌ పటేల్‌ కంటే ముందే అజిత్‌ పవార్‌ స్పందిస్తూ ‘మీరు మర్చిపోయారా..? మా పార్టీ జాతీయాధ్యక్షులు శరద్‌పవారే’ అని అన్నారు.

Manipur Violence: మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోవాల్సిందేనా.. సమస్యకు ముగింపు లేదా?

ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఈ చర్యలతో అజిత్ పవార్‭కు మద్దతు ఇస్తున్న రెబల్స్‭కు భవిష్యత్ తిరుగుబాటులకు పవార్ ఇలా గట్టి వార్నింగ్ ఇస్తున్నారని అంటున్నారు. కాగా, ఇప్పటికే ముంబై డివిజన్ ఎన్సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‭ముఖ్‭తో పాటు తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివాజీరావ్ గార్జే నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.