Manipur Violence: మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోవాల్సిందేనా.. సమస్యకు ముగింపు లేదా?
సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు.

What happened in Manipur
Manipur Violence Latest News: మణిపూర్ మంటల్లో మండిపోవాల్సిందేనా.. రెండు నెలలుగా రావణ కాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావా.. జాతుల కొట్లాటలో తగలబడిపోతున్న ఈశాన్య మణిహారాన్ని అలానే వదిలేద్దామా? ఇంతకీ మణిపూర్ లెక్క ఎక్కడ తప్పింది.. ఈ సమస్యకు ముగింపు ఎక్కడుంది?
ఈశాన్య భారతంలో ప్రత్యేక రాష్ట్రం మణిపూర్.. ఈశాన్యంలో రెండో అతిపెద్ద రాష్ట్రం.. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. శక్తివంతమైన నృత్య రూపాలు, సంగీతం, సుందరమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం.. మణిపూర్‌కే ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇప్పుడు నిత్య కల్లోల ప్రాంతంగా మారిపోయింది. సరళతను విశ్వసిస్తూ.. స్నేహపూర్వకంగా మసులుకునే మణిపూర్‌లో రెండు నెలలుగా విధ్వంసం.. విద్వేషమే కనిపిస్తోంది. దేశంలో తప్పనిసరిగా సందర్శించవలసిన ఎన్నో ప్రాంతాలు మణిపూర్‌లో ఉండగా.. ఇప్పుడు పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయాయి.
మణిపూర్ అంటే ‘రత్నాలతో నిండిన భూమి’ అని అర్ధం. పచ్చదనానికి ప్రసిద్ధి చెందిన ఈ ఈశాన్య రాష్ట్రంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే ఎన్నో అద్భుత ప్రాంతాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. మణిపూర్ చుట్టూ ఉన్న తొమ్మిది కొండలు.. మధ్యలో సౌందర్యం ఒలికించే లోయతో సహజసిద్ధంగా తయారు చేయబడిన ఆభరణంగా మణిపూర్‌ను వర్ణిస్తుంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ప్రత్యేక రాజ్యంగా ఉన్న మణిపూర్.. బర్మాకు బదులుగా స్వతంత్ర భారతదేశంలో కలవడానికే మొగ్గుచూపింది. ఒకప్పుడు పచ్చదనానికి.. అందమైన ప్రకృతికి నిలయంగా ఉన్న మణిపూర్ స్వాతంత్ర్యం వచ్చాక హింసాత్మక సంఘటనలకు నిలయంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా ఈ హింస కాస్త తగ్గినా.. మే 3న మొదలైన రిజర్వేషన్ల చిచ్చు నిత్య నరకంగా మార్చేసింది.
సాయుధ దళాలు పహరా కాస్తున్న.. రెండు నెలలుగా హింస అదుపు చేయడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారిపోయింది. రాష్ట్రం మొత్తం రెండు వర్గాలుగా విడిపోవడంతో పరస్పరం నమ్మకం లేక.. ఇరు వర్గాలు కత్తులు దూసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వం శాంతి.. శాంతి అంటున్నా.. ప్రభుత్వంపైనే విశ్వాసం లేకపోవడమే అసలు సమస్యగా మారింది. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ (Biren Singh) సర్కారు మైతీలకు ప్రాధాన్యమిస్తోందని రగిలిపోతున్న కుకీలు శాంతిస్థాపనకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. ఇక మెజార్టీ సామాజిక వర్గమైన మైతీల్లోనూ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో హింస పెచ్చరిల్లుతూనే ఉంది.
Also Read: అమర్నాథ్ యాత్ర వెనుక చరిత్ర ఏంటి.. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం విశేషాలు తెలుసుకోండి
ఈ హింసకు ఫుల్స్టాప్ పెట్టి.. మునుపటి పరిస్థితులు పునరుద్ధరించేందుకు హోంమంత్రి అమిత్‌షా ప్రయత్నించినా ఆశించిన ఫలితం లభించలేదు. అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకోడానికి ప్రతిపక్ష పార్టీల తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ప్రయత్నానికి సమాధానం లభించలేదు. అదుపులేని హింసతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆస్తులన్నీ ఆహుతికావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read: మహారాష్ట్ర తర్వాత టార్గెట్ బిహారేనా? అప్పుడే లాలూ, తేజశ్వీ, రబ్రీదేవిలపై సీబీఐ చార్జిషీట్
ఇక సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు. అలా అని సీఎం బీరేన్‌సింగ్ సూచనలను పాటించడం లేదు. ఇటు మైతీలు.. అటు కుకీలు పంతాలకు పోతుండటంతో పచ్చని ప్రకృతితో అలరాలాల్సిన రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారిపోయింది.
సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా డ్రామాలో సీక్రెట్ ఏంటి?.. వివరాలకు ఈ వీడియో చూడండి..