Bihar Politics: మహారాష్ట్ర తర్వాత టార్గెట్ బిహారేనా? అప్పుడే లాలూ, తేజశ్వీ, రబ్రీదేవిల‭పై సీబీఐ చార్జిషీట్

ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్‌పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రానుంది

Bihar Politics: మహారాష్ట్ర తర్వాత టార్గెట్ బిహారేనా? అప్పుడే లాలూ, తేజశ్వీ, రబ్రీదేవిల‭పై సీబీఐ చార్జిషీట్

Updated On : July 3, 2023 / 7:16 PM IST

Maharashtra Politics: మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం అనంతరం.. ఇక బిహార్లో కూడా ఇలాంటివే జరుగుతాయని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వంటి నేతలు వ్యాఖ్యనించారు. అంతలోనే రాష్ట్రీయ జనతా దళ్ అగ్ర నేతలపై చర్యలకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధమవుతోన్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగాల కుంభకోణం కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై సెంట్రల్ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది.

Opposition Meet: బెంగళూరు విపక్షాల సమావేశంపై ప్రభావం చూపిన ఎన్సీపీ రాజకీయ సంక్షోభం

ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్‌పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రానుంది. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ)లో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.

YS Sharmila: రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన హరీశ్ రావుకు వైఎస్ షర్మిల కౌంటర్

2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబానికి తక్కువ ధరకు భూములు విక్రయించారని, దానితో పాటు తమ సామాజిక వర్గానికి రైల్వేల్లో ఇష్టారీతిన నియామకాలు చేశారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.