నా కుమారుడు రాంచరణ్‌కు అవనిగడ్డ సీటు ఇవ్వండి, సీఎం జగన్‌ను కోరిన సింహాద్రి చంద్రశేఖర్ రావు

మూడు తరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ అవనిగడ్డ ప్రజలకు సేవలందించింది. రాంచరణ్ ను అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నా.

Avanigadda YCP Ticket

Simhadri Chandrasekhara Rao : అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి సింహాద్రి చంద్రశేఖర్ రావు వైసీపీలో చేరారు. చంద్రశేఖర్ రావు కుమారుడు సింహాద్రి రాంచరణ్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వీరు వైసీపీలో చేరారు.

అవనిగడ్డ నియోజకవర్గ ఇంఛార్జిగా సీఎం జగన్ ఇటీవలే తనను నియమించారని సింహాద్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. వయసురీత్యా ఎన్నికల్లో పోటీ చేయలేనని సీఎం జగన్ కు చెప్పానని ఆయన పేర్కొన్నారు. నాకు బదులుగా నా కుమారుడు సింహాద్రి రాంచరణ్ కు అవనిగడ్డ సీటు ఇవ్వాలని సీఎంను కోరానని వెల్లడించారు.

Also Read : వాళ్లను తిట్టవు నిన్నెలా నమ్మాలని అడిగారు.. జగన్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన వసంత కృష్ణప్రసాద్

”నా కుమారుడు రాంచరణ్ అయితే ఉత్సాహంగా తిరిగి పనిచేస్తాడు. గడప గడపకు తిరిగి అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ గెలుపునకు ప్రయత్నిస్తాడు. మూడు తరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ అవనిగడ్డ ప్రజలకు సేవలందించింది. సింహాద్రి రాంచరణ్ ను అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నా. ప్రస్తుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాకు సహకరిస్తారు” అని సింహాద్రి చంద్రశేఖర్ రావు అన్నారు.

Also Read : జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు