పవన్ ట్వీట్ : ఆత్మహత్యలు కదిలించాయి

  • Publish Date - October 28, 2019 / 01:33 PM IST

కార్మికుల ఆక్రోశం..ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలని, భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్మికుల ఆత్మహత్యలు తన మనస్సును కుదిపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ, వామపక్షాలు స్పందించాయనే విషయాన్ని గుర్తు చేశారు.

పోరుకు మిగతా పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో నెలల తరబడి ఉపాధి లేక కష్టాల పాలవుతున్నారని తెలిపారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా మనమంతా కలిసి పోరాడాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 03వ తేదీన విశాఖపట్టణంలో జనసేన భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్‌ను ఇసుక లారీల యజమానులు కలిశారు.
Read More : చేనేతకు చేతనైన సాయం: మాట నిలబెట్టుకున్న జగన్
మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌తో భేటీ అయి..తమ కష్టాలను ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు పవన్. ఈ అంశంపై ఇసుక కొరత ఏపీలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశంపై టీడీపీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేసింది. తాజాగా పవన్ చేసిన ట్వీట్స్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ట్రెండింగ్ వార్తలు