టీడీపీ, జనసేన డీఎన్ఏ ఒక్కటే : పోరాటాలు చేయబట్టే తమపై కేసులు – అంబటి

  • Publish Date - November 4, 2019 / 05:11 AM IST

‘వాట్ యువర్ నైజం పవన్ కళ్యాణ్…ఏం పోరాటాలు చేశారు..పోరాటాలు చేయబట్టే తమపై కేసులున్నాయి..వాస్తవాలు ఏంటో గ్రహించాలి..సినిమాల్లో వేషాలు వేసుకొనే పరిస్థితి దగ్గరలో ఉంది’ అంటూ పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం కోసం జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్..పవన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అంబటి. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…

స్పష్టత లేని, కన్ ఫ్యూజన్ రాజకీయాలను పవన్ నడుపుతున్నారని, ప్రజలు అర్థం చేసుకుని తమకు పట్ట కట్టారన్నారు. వాస్తవాలను న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏం పోరాటం చేశారని సూటిగా ప్రశ్నించారు. టీడీపీకి కొమ్ము కాసే పరిస్థితి ఉందన్న అంబటి..టీడీపీకి బీటీం..పవన్ దత్తపుత్రుడని మరోసారి స్పష్టం చేశారు. జగన్ అద్బుత పరిపాలన చేస్తే సినిమాలకు వెళ్లి..వేషాలు వేసుకుంటానని పవన్ చెప్పారని..ఇది దగ్గరలో ఉందన్నారు. పవన్ వేషాలు వేసుకొనే పరిస్థితి..బాబు హెరిటేజ్ కంపెనీ నడుపుకోవడం ఖాయమన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అంబటి వెల్లడించారు.

2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు జనసేనానీ. జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని, జగన్ అంటే మ్యాన్ ఫ్రై డే అని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారంటూ పవన్ విమర్శించారు. 
Read More : ఏపీలో 19 కంపెనీలు : ఐటీ రంగంలో 3 వేల ఉద్యోగాలు

ట్రెండింగ్ వార్తలు