పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే- పార్థసారథి సంచలన వ్యాఖ్యలు

37 సంవత్సరాల నుండి ఒకే జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాను. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు షికారులు నమ్మవద్దు..

B K Parthasarathi

B K Parthasarathi : శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. టికెట్ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే ఉంటానని ప్రకటించారు. పెనుకొండ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. టికెట్ వేరే వారికి ఇస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. పెనుకొండ టీడీపీ టికెట్ ఇంకా ఎవరికీ కేటాయించలేదన్నారు. అపోహలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.

Also Read : ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట

”పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ అధిష్టానం ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ నాదే. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీకి సిద్ధం. ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటాను. పెనుకొండ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా నేనే కొనసాగుతున్నా. నేను ఏ పార్టీ మారలేదు. ఒకే జెండా, ఒకే అజెండాతో ముందుకెళ్తున్నా. ఎక్కడా తప్పు చేయలేదు. రేపటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నా. 37 సంవత్సరాల నుండి ఒకే జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాను. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు షికారులు నమ్మవద్దు” అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియజేశారు బీకే పార్థసారథి.