Undavalli Arun Kumar : ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట
ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని అన్నారు.
Arun Kumar : ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని అన్నారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు.. జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటిని ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు.
Also Read : MLC Kavitha : గృహలక్ష్మీ పథకం ప్రారంభించడానికి ఆమెను ఏ హోదాలో పిలుస్తారు? మేము ఖచ్చితంగా నిరసన తెలుపుతాం
కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉండవల్లి.. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతాని అన్నారు. జనాభాలోనూ.. అబద్దాలు ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే మనదేశం నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలోఉన్న 25మంది ఎంపీలు బీజేపీకి మద్దతు దారులేనని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే అందరూ ఒకటి కావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.