చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు కీలక భేటీ

చంద్రబాబుతో భేటీ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao : చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేయాలంటూ టీడీపీ హైకమాండ్ అంటుండడగా.. గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ ఆశిస్తున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. విజయనగరం జిల్లా చీపురుపుల్లి స్థానానికి పోటీ చేయాలని అధిష్టానం వర్గం గంటాను ఆదేశించింది. అయితే, గంటా మాత్రం తాను గతంలో పోటీ చేసిన భీమిలి నుంచే ఈసారి బరిలోకి దిగుతానని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం గంటాతో చెప్పింది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా రెండు నియోజకవర్గాలను ఆలోచన చేస్తున్నారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లోనూ కొంత చర్చ జరుగుతోంది. మొత్తంగా గంటా వ్యవహారాన్ని ఇవాళ్టితో క్లోజ్ చేయాలని చంద్రబాబు ఆయనను పిలిపించారని పార్టీ వర్గాల సమాచారం.

ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం గంటాను ఆదేశిస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించారు. అక్కడ నాగార్జునకు ప్రజల నుంచి అనుకూలత రావడం లేదని సమాచారం. గంటా లాంటి పేరున్న వ్యక్తి బొత్స సత్యనారాయణపై పోటీ చేస్తే అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం ఆ ప్రతిపాదనలను గంటా ముందు ఉంచారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

 

ట్రెండింగ్ వార్తలు