టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మండవ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌లో చేరాలని కేసీఆర్ సూచించినట్లు..దీనికి త్వరలోనే నిర్ణయం వెలువరిస్తానని మండవ చెప్పినట్లు తెలుస్తోంది. రెండు..మూడు రోజుల్లో ఆయన TRSలో చేరుతారని సమాచారం.
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బలమైన నేతగా మండవ ఉన్నారు. ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ నుండి కేసీఆర్ కుమార్తె కవిత బరిలో నిలిచారు. అయితే ఇక్కడ రైతులు కూడా భారీగానే నామినేషన్లు దాఖలు చేశారు. తీవ్రమైన పోటీ ఉండడంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మండవ సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకుని ఆయన ఇంటికి స్వయంగా కేసీఆర్ వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మండవ వెంకటేశ్వరరావు పెద్దగా పరిచయం లేని పేరు. గత కొన్నేళ్లుగా ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా టీడీపీకి మండవ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాబు హాయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీడీపీ పూర్తిగా తన బలాన్ని కోల్పోయింది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదనే సంగతి తెలిసిందే.
Read Also : అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్