Tej Pratap Yadav: బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్‭కు యూపీలో దారుణ అవమానం.. అర్థరాత్రి ఆయన లగేజీ బయటపడేసిన హోటల్ సిబ్బంది

హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు హోటల్ నిర్వాహకుల్ని సంప్రదించగా..

Tej Pratap Yadav

Tej Pratap Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ యాదవ్‭కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణ అవమానం జరిగింది. తాజాగా వారణాసిలో ఒక హోటల్ గదిలో బస చేసిన ఆయన లగేజీని సిబ్బంది బయటకు విసిరేసింది. అయితే అర్థరాత్రి తేజ్ ప్రతాప్ బయటికి వెళ్లిన సమయంలో ఇలా చేశారు. తిరిగి హోటల్‭కు చేరుకున్న తేజ్ ప్రతాప్.. రిసెప్షన్ వద్ద తన లగేజీ చూసి ఖంగుతినాల్సి వచ్చింది. అయితే ఒక్క రోజుకు మాత్రమే హోటల్ గదిని బుక్ చేశారని, అందుకే సామాన్లు బయట వేయాల్సి వచ్చినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.

Darshan Solanki: IIT-బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య కేసులో కీలక పురోగతి.. సూసైడ్ నోట్ లో పేర్కొన్న నిందితుడు అరెస్ట్

గురువారం హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు హోటల్ నిర్వాహకుల్ని సంప్రదించగా.. గురువారం 6వ తేదీని మాత్రమే గది బుక్ చేసుకున్నారని, అయితే శుక్రవారం ఆ గదిని మరొకరికి కేటాయించడంతో లగేజీ బయట పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ తనకు సమాచారం ఇలా ఇవ్వకుండా మంత్రి పట్ల ఇలా అమర్యాదగా వ్యవహరించడంపై తేజ్ ప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Instagram Job Scam: ఉద్యోగం కోసం ఇన్‭స్టాగ్రాంలో అప్లై చేస్తే.. బ్యాంకు నుంచి రూ. 8.6 లక్షలు మాయం