Darshan Solanki: IIT-బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య కేసులో కీలక పురోగతి.. సూసైడ్ నోట్ లో పేర్కొన్న నిందితుడు అరెస్ట్

పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మారిపోయిందట

Darshan Solanki: IIT-బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య కేసులో కీలక పురోగతి.. సూసైడ్ నోట్ లో పేర్కొన్న నిందితుడు అరెస్ట్

Darshan Solanki

Darshan Solanki: కొంత కాలం క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మరణం దేశాన్ని కుదిపి వేసింది. యూనివర్సిటీ క్యాంపస్‭లో కుల వివక్ష దాడి భరించలేక రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం భగ్గున లేచింది. ఇది గడిచి ఏడేళ్లైనప్పటికీ, ఇంకా పచ్చిగానే తాకుతుంటుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఐఐటీలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి అనే విద్యార్థి కుల వివక్ష దాడిని తట్టుకోలేక ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Rajasthan Politics: మాజీ సీఎం.. ప్రస్తుతం సీఎం.. సచిన్ పైలట్ టార్గెట్ ఎవరు?

కాగా, ఆత్మహత్యకు ముందు దర్శన్ సోలంకి సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన సహ విద్యార్థి పేరు రాసి, అతడే తన చావుకు కారణమని పేరు రాశాడు. కాగా ఆ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన మూడు నెలల అనంతరం ముంబై పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆదివారం అరెస్టు చేయడం గమనార్హం. సోలంకి హాస్టల్ గదిలో “అర్మాన్.. నువ్వే నన్ను చంపావు” అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను సిట్ కనుగొంది.

Instagram Job Scam: ఉద్యోగం కోసం ఇన్‭స్టాగ్రాంలో అప్లై చేస్తే.. బ్యాంకు నుంచి రూ. 8.6 లక్షలు మాయం

ఈ విషయమై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ “మేము ఖత్రీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసాము. అయితే వారి మధ్య వివాదానికి దారితీసిన కారణాన్ని అతను వెల్లడించలేదు. అందువల్ల మేము అతనిని ప్రశ్నించడానికి ఖత్రీ, సోలంకీ మధ్య జరిగిన సంఘటనలకు ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి అరెస్టు చేశాము’’ అని అన్నారు.

baby girl : 138 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీలో ఆడపిల్ల .. ఆసక్తి కలిగిస్తున్న స్టోరి

యూనివర్సిటీలో దర్శన్ ఎదుర్కొన్న కుల వివక్షపై అతడి సోదరి జాన్వి సోలంకి స్పందిస్తూ ‘‘పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మారిపోయిందట. దర్శన్‭తో కలిసి బయటికి వెళ్లేవారే కాదట. దీంతో చాలా డీప్ డిప్రెషన్లోకి దర్శన్ వెళ్లిపోయారు. తనని చూసినప్పుడు అలాగే కనిపించేవాడు. చివరికి అది ఆత్మహత్యకు దారితీసింది’’ అని పేర్కొంది.